కవర్ పేజీకి కరీనాను వాడుకున్న వీ.హెచ్.పీ

January 08, 2015 | 01:37 PM | 23 Views
ప్రింట్ కామెంట్

మత మార్పిళ్లపై విశ్వహిందూ పరిషత్ తమదైన శైలిని అనుసరిస్తూనే ఉంది. తాజాగా లవ్ జిహాద్ పేరిట మరో ఉద్యమానికి తెరలేపింది. ఇందులో భాగంగా సంస్థ కు చెందిన హిమాలయా వాహిని అనే మ్యాగ్ జైన్ కవర్ పేజీపై బాలీవుడ్ నటి కరీనాకపూర్ ఖాన్ ఫోటోను ప్రచురించింది. సగానికి సగం ముసుగు ముఖాన్ని కప్పి ఉన్న ఈ చిత్రం ద్వారా ఓ సందేశాన్ని ప్రచురించింది. లవ్ జిహాద్ ముస్లిం పురుషుడిని పెళ్లి చేసుకున్న హిందూ మహిళలను తిరిగి మతం మార్చటం వంటి సమస్యల పరిష్కారం అని ఫోటో కింద పేర్కొంది. నటుడు సైఫ్ అలీ ఖాన్ వివాహం చేసుకున్న కరీనా ఓ సెలబ్రిటీ, కాబట్టి ఆమెను కొంతమంది అనుసరించవచ్చునని, అందుకే ఆమెను ఉదాహరణగా చూపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ట్విస్ట్ ను బహుశా కరీనా ఊహించి ఉండకపోవచ్చు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ