అంటే తనేదో తట్టో బుట్లో ఎత్తుకుని నృత్యం చేసిందనుకుంటే పొరపాటే... ఈ అమ్మడికి మామూలుగానే పేషన్స్ ఎక్కువనీ, ఎలాంటి ఇబ్బందికరమైన సీన్లలో అయినా డెడికేషన్ తో నటిస్తుందనే మంచి పేరు. ఆమె నటించిన ‘కీ అండ్ కా’లోనూ ఓ ఇబ్బందికర నృత్యం చేయాల్సి వచ్చినా కిమ్మనకుండా రెండు రోజులూ చేసేసిందట. ఇంతకీ ఆ ఇబ్బంది ఏంటంటే తన డ్రెస్సే... ఈ మధ్య ఏ కాస్త బరువున్న దుస్తులనైనా వేసుకోడానికి ఇష్టపడని వాళ్ళు చాలా మందే ఉన్నారు. తమ ఒళ్ళు తమకే భారమైనట్టు ఉష్... ఇష్... లు వినిపిస్తుంటాయి చాలా మంది నుంచి...
అయితే కరీనా నటించిన కీ అండ్ కా సినిమాలో ఓ భారీ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ లో కరీనా లుక్ చాలా గ్రాండ్ గా వుండేందుకోసం ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో ఓ డ్రెస్ డిజైన్ చేయించాడు బాల్కీ.
గ్రాండ్ గా వుండాలని డిజైన్ చేసిన ఆ డ్రెస్ బరువు చివరకు 32 కిలోలకు చేరింది. ఇది సంప్రదాయ లెహంగా చోళీ. ఈ డ్రెస్ వేసుకొని కరీనా షూటింగ్ లో పాల్గొంది. రెండు రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించారు. ఆ రెండు రోజూలూ ఒక్కసారి కూడా విసుక్కో కుండా కరీనా ఈ దుస్తుల్లో నర్తించడం బల్కీకి ఆశ్చర్యమనిపించిందట.
ఈ సినిమా షూటింగ్ సమయంలో కరీనా డెడికేషన్ చూసి చిత్ర యూనిట్ అంతా ఆశ్చర్యపోయారట.
కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో కరీనాతో పాటు అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్, అర్జున్ కపూర్ మరియు తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.