కరీనాకే కాదు.... తారలకెవరికైనా కోపమొస్తుంది. తమ అందం కోసం వారు ఎంతో కష్ట పడుతుంటారు... జీరో సైజ్ కోసం ఎన్నో వ్యాయామాలు చేస్తూ వయసు పైబడినా అందం తరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంత కష్టంతో తమ అందాన్ని కాపాడుకుంటుంటే.... ఓ మందుల కంపెనీ తమ మందులు వాడ్డం వల్లే ఆమె అంత అందంగా ఉందని ప్రచారం చేసుకుంటే కోపం రాదా.... అందుకే కోపం వచ్చేసిందట కరీనా కపూర్ కు. తన అందాన్ని పైసా ఖర్చు లేకుండా ఇతరులు క్యాష్ చేసుకుంటే ఊరుకుంటారా? కరీనా తన పేరు ఆ కంపెనీ వాడుకుంటున్నందుకు గానూ ఆ సంస్థపై 20 కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలంటూ దావా వేసిందట. అంతే కాదండీ.... ఉచిత పబ్లిసిటీ చేస్తున్న ఆ సంస్థ వార్తలు వేసిన వార్త పత్రికలపై కూడా కేసు వేయడానికి సిద్ధమవుతోందట కరీనా కపూర్.