ఇటీవల కాలంలో కత్రిన కైఫ్ వార్తల్లో కనిపించి చాలా రోజులైనట్టుంది. వాణిజ్య ప్రకటనల షూటింగ్ తో బిజీగా ఉన్న కాట్ కాస్త విరామంతో పాటు ఓ శుభ వార్త కూడా అందుకుంది. ఈసారి ఈవిడ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేయబోతోంది. ఈవిడ కేన్స్ లో తొలిసారిగా రెడ్ కార్పెట్ పై నడవబోతోందట. ఈమెతో పాటు ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్ కూడా కేన్స్ లో కేట్ వాక్ చేస్తున్నారట. ఈ అవకాశం కత్రినా కైఫ్ కు మొదటి సారిగా రావడంతో ఆమె ఆనందానికి పట్ట పగ్గాలు లేవంటోంది. ‘లోరియల్ పారిస్ తరఫున, భారత్ తరఫున ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రాతినిథ్యం వహించడం చాలా ఎగ్జైట్ గాఉంది. ఈ పండుగలో లోరియల్ కు చెందిన ఇతర అంబాసిడర్లను కలుసుకునే అవకాశం వచ్చింది. అందుకే... ఆనందంతో గంతులేయాలని ఉంది’’ అని చెపుతోంది కత్రినా కైఫ్. ఈమెకు కేన్స్ సినీ ఫెస్టివ్ ఆహ్వానం అందడం పై సోనమ్ కపూర్ కూడా ఆనందం వ్యక్తం చేసింది. ఈసారి ఈ ముగ్గురూ కలసి కేన్ ఫెస్టివల్ లో భారత్ తరఫున మెరుపు తీగల్లా వెలిగిపోనున్నారు.