కత్రినా... హాట్ హాట్ ఫొటో షూట్

December 06, 2014 | 03:10 PM | 41 Views
ప్రింట్ కామెంట్

బాలీవుడ్ లో దశాబ్దకాలంగా హీరోయిన్ ఇమేజ్ ను పదిలపరచుకుంటూ వస్తున్న నటి కత్రిన. హీరోయిన్లలో ఇలా వచ్చి అలా కనుమరుగయ్యే వారి సంఖ్యే ఎక్కువ. కానీ ఫీల్డులోకి వచ్చిన నాటి నుంచీ కూడా పెద్ద హీరోల సరసన నటిస్తూ వారికి సమానమైన క్రేజ్ వచ్చేలా అభిమానుల్ని సంపాదించుకుంది. ధూమ్ 3లో అమీర్ సరసన, బ్యాంగ్ బ్యాంగ్ లో హృతిక్ సరసన నటించి పలువురి మన్ననలు పొందింది. యాక్షన్ సినిమాల్లోనూ ఆమె నటనకు, ధైర్యానికి ప్రతి ఒక్కరూ ప్రశించక మానరు. అయితే ప్రస్తుతం కత్రిన ఒక మాగజైన్ కవర్ పై దర్శనమిచ్చి తన అందచందాలను ఒలకబోసింది. ఈ మాగజైన్ కత్రిన ఫొటోలను వివిధ రకాల భంగిమల్లో ప్రచురించింది. ఇందులో కత్రిన ఒక అల్ట్రా మోడల్ గెటప్ లో పోజులిచ్చేసింది. గోల్డ్ కలర్ డెనిమ్ జీన్స్, టాప్స్ తో విపరీతంగా జనాలను ఆకర్షించే విధంగా ఉన్నాయి ఫొటోలన్నీ. మరి ఈ అమ్మడు ఇంకా ఎంత కాలం బాలీవుడ్ ను ఏలుతుందో, లేక పెళ్ళికూతురై ఇంటిపట్టున ఉంటుందోనని అభిమానులు అనుకుంటున్నారు. లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్ రణబీర్ తో నైనా పెళ్లి పీటల దాకా వెళ్తుందో లేదో మరి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ