బహుబలిలో కైలాష్ స్వరం

March 24, 2015 | 05:48 PM | 66 Views
ప్రింట్ కామెంట్
Kailash_Kher_niharonline

కొన్ని ప్రత్యేకమైన పాటలకు ఈ వాయిసే బాగుంటుందన్నట్టు, ఈ బాలీవుడ్ సింగర్ కైలాష్ ఖేర్ ను తెలుగు సినిమాలకు పాడడానికీ రప్పించేస్తున్నారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ సాంగ్ పాడాలంటే కైలాష్ స్వరం ఉండాలంటున్నారు మన తెలుగు సినిమా డైరెక్టర్లు. అంతలా పేరు పడిపోయింది కైలాష్ వాయిస్ కి. ఈ మధ్యే గోపాల గోపాల సినిమాలో కూడా ఆయన చేత ’ఎందుకో... ఎందుకో...’ అనే పాట పాడించారు. ఆ పాట చాలా పెద్ద హిట్ అయ్యింది కూడా. ఇప్పుడు ఈయన వాయిస్ రాజమౌళి కూడా తన బాహుబలి చిత్రంలో వాడుకున్నారట. ఈ విషయాన్ని కైలాష్ ఖేర్ తన సోషల్ నెట్ వర్క్ పేజీలో షేర్ చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ