నరుక్కోడం... పొడుచుకోవడం... రక్తం ఏరులై పారడం... వంటి ఫాక్షన్ సినిమాలకంటే... విడుదలకు సిద్ధంగా ఉన్న కీచక సినిమా మరింత భయానకంగా అనిపిస్తోంది. ఈ సినిమా క్లాప్పింగ్ ఒకటి లీకైనట్టుగా చెపుతున్నా ఇది ప్రేక్షకులు చూడ్డం కోసం విడుదల చేసిందనిపిస్తోంది. ఇలాంటి ఏ భయానక సినిమాలు చేసిన నిర్మాతలు సమర్దించుకోడం తెలిసిందే. పైగా ఒక సందేశం ఇవ్వాలంటే ముందు జరిగింది చూపించాలి కదా అంటుంటారు. ‘కీచక’ వీడియో క్లిప్పింగ్ చూస్తే కడుపులో తిప్పేసినట్టవుతోంది. భయంకరమైన రేప్ సీన్లు అంతే భయంకరంగా ఆడవాళ్ళను హింసించడం. ఈ నెల 30న ‘కీచక’ సినిమా విడుదల కాబోతోంది. సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇచ్చి ఇలాంటి సినిమాను వదలడం కన్నా... బాన్ చేయడం మంచిదేమో అనిపిస్తుంది. ఇంత హింస చూపించడం అవసరమా?