ప్రతి సంవత్సరం ఎన్నో రకాల క్యాలెండర్లు ఆకర్షణీయంగా కనువిందు చేస్తుంటాయి. కానీ క్యాలెండర్ అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చది కింగ్ ఫిషర్. అసలే కోతి ఆపై కల్లు తాగింది అనే లెవల్లో ఆ బ్రాండ్ కు తగినట్టుగా భామలు ఓ రేంజ్ లో రెచ్చిపోయి పోజులిస్తారు. కొత్త సంవత్సరంలో ఎన్నో రకాల సెలబ్రేషన్స్ అందులో ఈ క్యాలెండర్ ను దక్కించుకోవడం ఓ భాగంగా భావించేవారూ ఉన్నారు మరి! ప్రతి ఏటా బికినీ భామల కేలండర్ రూపొందించడం విజయ్ మాల్యా ప్రత్యేకత. 2015 కు కూడా అలాంటి అందాల ఆరబోత క్యాలెండర్ నిండా పరుచుకుంది. దశాబ్దకాలంగా ఇది నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి క్యాలండర్ తయారు చేయడం ఆయన హాబీ. ఆ భామలతో భుజాలు భుజాలు కలిపి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఆయనకు మహా సరదా. కింగ్ ఫిషర్ కేలండర్ 2015 అందాల భామలను ఈ ఏడాది ఆయనే ఎంపిక చేశారు. భామలను ఎంపిక చేయమని ఓటింగ్ సైతం పెట్టారు. నాటి కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఫస్ట్ లుక్ బయిటకు వచ్చింది. సెలబ్రెటీ ఫొటోగ్రాఫర్ అతుల్ రీసెంట్ గా తన ఫొటో షూట్ లోని నాలుగు ఫోటోలను విడుదల చేసారు. వీరిలో ఒకరిని కింగ్ ఫిషర్ క్యాలెండర్ కి కవర్ పేజీకి ఎంపిక చేస్తారట.