సురేందర్ రెడ్డి దర్వకత్వంలో తెరకెక్కుతున్న ‘కిక్-2’ మూవీ షూటింగ్ ముగించి తెరముందుకు తెస్తున్నారనుకుంటున్న సమయంలో మాస్ మహారాజా అభిమానులకు ఓ చేదు వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ రవి తేజకు సంత్రుప్తినివ్వకపోవడంతో మళ్ళీ రీ షూట్ చేద్దామని ఆ హీరో సురేందర్ రెడ్డిని రిక్వెస్ట్ చేసినట్టు, అందుకు ఆయన అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కొన్ని చోట్ల రవి తేజ మరీ సన్నగా కనిపించాడనీ, సీన్స్ లో కూడా కాస్త హుషారు తగ్గినట్టు కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. నిజానిజాలు ఏమిటన్నది తెలియకపోయినా ఈ వార్త మాత్రం ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతోంది. దీంతో సినిమా మరికాస్త లేట్ గా రిలీజ్ కావచ్చునని అనుకుంటున్నారు. నటుడు కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో రవికి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ 70 శాతం పూర్తి అయినట్లు యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇదిలావుండగా.. ఇంతవరకు రవితేజ నటించిన సినిమాలన్నింటిలోనూ ఒక్కసారి కూడా రీ-షూట్ చేయలేదు. మొదటి షూట్ కే తన బెస్ట్ పెర్ఫార్మెన్ తో మెప్పించే ఈ నటుడు.. ఈసారి ‘కిక్-2’ కోసం రీ-షూట్ చేయడం ఆశ్చర్యంగా వుందని అంటున్నారు.