ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు...

January 24, 2015 | 05:47 PM | 33 Views
ప్రింట్ కామెంట్

కోలీవుడ్ లో రాజేష్ కన్నన్ అనే ఓ డైరెక్టర్ బుల్లితెరమీద కెరీర్ ప్రారంభించు. నెమ్మది నెమ్మదిగా వెండి తెరకు పాకిపోయారు. అయితే ఈ డైరెక్టర్ ఇప్పుడు ఏక కాలంలో ఏడు సినిమాలకు దర్శకత్వం వహిస్తానని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఒకేసారి ఇన్ని సినిమాలు తీయడం ఎందుకు? ఎలా చేయగలడని అందరికీ పెద్ద టాపిక్ అయ్యింది ఈయన విషయం. ఈయనకు ఎలాంటి సినిమా నేపథ్యం కూడా లేదట. వెంట వెంటనే సినిమాలు పూర్తి చేస్తానని అంటున్నాడు. కొన్ని సినిమాలకు స్వయంగా, మరికొన్ని సినిమాలకు కొత్తవారికి అవకాశం ఇస్తానంటున్నాడు. ఈ ఏడు సినిమాలు కూడా ఏడు జోనర్ లలో డిఫరెంటుగా తీయడానికి సన్నహాలు చేస్తున్నాడు. ఇలా చేయడం ఎలా సాధ్యం అని అందరూ ఆశ్చర్యపోతుంటే, విషయం బయటికి పొక్కింది. ఈ సినిమా లన్నిటికీ మలేషియా, అబూదబీ లాంటి చోట్ల పెద్ద పెద్ద వ్యాపారవేత్తల్ని సినిమాలకు నిర్మాతలుగా ఒప్పించాడట. ఇకనేం పెట్టుబడి దారులు దొరికినప్పుడు కష్టపడడానికి సినిమా వాళ్ళు కొదవా? ఈ సినిమాలు... మజయిల్ ఒరు హై, లాండు... ఒబామా ఫ్రం మధురై, కడవుల్ ఇరుక్కాన్ కుమరు, కొల్ల కూట బాస్, వట్ట నయజలార్ మురుగన్, నీంగ పుడుంగర ఆని ఎల్లమే తేవాయ్ ఇల్లత అనై తాన్, కోక్... ఈ ఏడు చిత్రాలను టైటిల్స్ తో సహా ప్రకటించి ఒకేసారిగా పూర్తిచేయడానికి సన్నద్ధమవుతున్నాడట ఈ డైరెక్టర్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ