అంజలి అంటే అంత భయం ఎందుకు?

November 09, 2015 | 05:51 PM | 3 Views
ప్రింట్ కామెంట్
directors-fear-about-anjali-attitude-media-niharonline

టాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్ లోనూ నటి అంజలికి పిచ్చ క్రేజ్ ఉంది. పచ్చిగా చెప్పాలంటే ముందు తెలుగు సినిమాలో నటించి గుర్తింపు రాక తమిళంకు వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగి, తిరిగి తెలుగులోకి వచ్చిందామో. సీతమ్మ వాకిట్లో ద్వారా తెలుగు ప్రేక్షకులపై మాయ చేసి పడేసింది. ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న నాయికల్లో ఆమె ఒకరు. అంజలి వుంటే చాలు అనుకుని థియేటర్ కి వెళ్లే యూత్ కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అందుకే అవకాశాలు వెతుక్కుంటూ మరి ఆమె గుమ్మం దగ్గరికి వెళ్తున్నాయి. అయితే అదే టైంలో ఆమెకు ఓ వీక్ నెస్ ఉందట. దాంతో దర్శకులు తెగ వణికిపోతున్నారు.

ఇంతకీ విషయమేంటంటే... అంజలి ఏ సినిమాలో అయినా సరే నటిస్తే, ఒకవేళ మీడియా గనక ఎదురుపడితే మొత్తం సినిమా స్టోరీ చెప్పిపడేస్తుందట. దీంతో డైరక్టర్లు బెంబెలెత్తిపోతున్నారు. తమ సినిమాల విషయంగా మీడియా ముందుకు రాకుండా ప్రస్తుతం ఓ ఇద్దరు దర్శకులు ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. తమిళ్లో అంజలి 'తరమణి' .. 'ఇరైవి' అనే చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాలోని కొన్ని విశేషాలను దర్శకులు గోప్యంగా ఉంచాలని నిర్ణయించుకుని మీడియా ముందుకి వాళ్లే వెళుతున్నారట. అంజలి అమాయకంగా గలగలా మాట్లాడేస్తూ అసలు సంగతి చెప్పేస్తుందన్నదే వాళ్ల కంగారుకి కారణమట. ప్చ్... సీతమ్మ అమాయకత్వంతో దర్శకులకి ఎన్ని కష్టాలో...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ