విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట

September 15, 2015 | 12:14 PM | 3 Views
ప్రింట్ కామెంట్
konkona-sen-ranvir-shore-divorce_niharonline

వివాహ బంధాన్ని తెగతెంపులు చేసుకోవడమంటే ఇప్పుడు దుస్తులు మార్చినంత తేలికనుకుంటున్నారు సినిమా పరిశ్రమ వారు. రెండు మూడు రోజుల క్రితమే కన్నడ సూపర్ స్టార్ సుదీప్ తన భార్యనుంచి విడిపోతున్నట్టు మీడియా వారికి తెలిపి సంచలనం సృష్టించాడు. వీరిది 14 యేళ్ళ వైవాహిక జీవితం. వీరికి 11 ఏళ్ళ కూతురు కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ  మరో బాలీవుడ్ జంట తాము విడిపోతున్నట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు.  2007లో డేటింగ్‌ ప్రారంభించిన 2010లో వివాహం చేసుకున్న కొంకణాసేన్‌ శర్మ, రణవీర్‌ షోరే పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇద్దరికీ హరూన్‌ అనే నాలుగేళ్ల కొడుకున్నాడు. ‘‘విడిపోవాలని రణవీర్‌ నేను నిర్ణయించుకున్నాం. అయితే స్నేహితులుగా, మా అబ్బాయికి తల్లిదండ్రులుగా కొనసాగుతాం. దీనికి అందరి మద్దతు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్‌ యు'' అని 35 ఏళ్ల కొంకణ ట్వీట్‌ చేయగా, ఆమె ట్వీట్‌లో కొంకణ అనే పేరున్న చోట రణవీర్‌ అనే పేరు పెట్టి సరిగ్గా అవే మాటలతో తను కూడా ట్వీట్‌ చేశాడు 43 ఏళ్ల రణవీర్‌. ఈ ఇద్దరూ కలిసి ‘ట్రాఫిక్‌ సిగ్నల్‌', ‘మిక్స్‌డ్‌ డబుల్స్‌', ‘ఆజా నాచ్‌లే', ‘గౌర్‌ హరీ దాస్తాన్‌' వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ఆ సినిమా సమయాల్లోనే ఒకరికొకరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. ఇప్పుడు విభేదాల కారణంగా విడిపోతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ