ఎవరి లక్ ఎలా తిరుగుతుందో తెలియదు కదా... అందులో సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాతో క్లిక్ అయ్యారంటే... వారికి అదృష్టం బాగుందని వారిని ఇండస్ట్రీ అంతా నెత్తిమీద పెట్టుకుంటుంది. ఇక ఫ్లాపయితే చెప్పక్కర్లేదు ఎంత ఎత్తులో ఉన్న వారినైనా కిందకు పడదోస్తారు. ఇప్పుడు బాగా సుడితిరిగిన వారి పేర్లలో కొరటాల శివ పేరు బాగా వినబడుతోంది. కొరటాల శివకు శ్రీమంతుడుతో బాగా డిమాండ్ పెరిగింది. ఆయన మొదటి సినిమా ప్రభాస్ మిర్చి బ్లాక్ బస్టర్ రెండోదీ హిట్టే... ఇప్పుడు తన మూడో చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేస్తున్న విషయం తెలిసిందే కాగా ఈ చిత్రానికి గాను శివ అందుకుంటున్న రెమ్యునరేషన్ అక్షరాల 15 కోట్లంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ... ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చ. కేవలం రెండు బ్లాక్ బస్టర్ లతోనే 15 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు కొరటాల శివ . ఆయన రెండు సినిమాలూ కలెక్షన్ల పంట పండడంతో... నిర్మాతలు చేయబోయే మూడు సినిమాలకు ఆయన అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అయిపోయారట.