తెలంగాణ హిస్టారికల్ మూవీగా ‘రుద్రమదేవి’ సినిమాకు సి.ఎం పన్ను మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే విధంగా దర్శకుడు క్రిష్ 2వ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో కంచె అనే మరో హిస్టారికల్ మూవీ తీశారు. ఈ సినిమాకు కూడా పన్ను మినహాయింపు అర్హత ఉన్న సినిమాగా పలువురు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడమే కాదు కలెక్షన్లు కూడా బాగా వస్తున్నాయి. రాష్ట్రంలోనూ, ఓవర్సీస్‌లోనూ లాభాల బాటలో నడుస్తోంది. దీంతో ఈ చిత్ర బృందం ఆనందంలో మునిగి తేలుతోంది.
ఈ సినిమాలో కుల తత్వం, జాతి వివక్షలను బాగా చూపించారు. ఈ విషయంలో పలువురు అభినందిస్తున్నారని క్రిష్ అంటున్నాడు. కంచె ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు వెళ్ళే అవకాశముందని కూడా భావిస్తున్నాడు. అయితే పన్ను మినహాయింపు విషయంలో సీఎం దృష్టికి తీసుకువెళ్ళనున్నట్టు తెలిపారు క్రిష్.