వరుణ్ తేజ్ గారెల బుట్టలో పడ్డాడు. సెకండ్ సినిమాతోనే ఇంత మంచి క్యారెక్టర్ లో పడడం ఈ యువ హీరో అదృష్టం. అది కూడా తన రూటే వేరు అనేలా ఉండే దర్శకుడు క్రిష్ చేతిలో పడ్డాడు. ఈ మేకింగ్ వీడియో చూస్తే మైండ్ బ్లోయింగ్... ఇప్పటి సినిమానేనా ఇది అనేలా ఉంది. ఆ లొకేషన్స్, ఆ నటుల కాస్టూమ్స్, ఆ పాత కాలం నాటి వాహనాలు... ఎక్కడినుంచి తెచ్చాడు క్రిష్ అన్నట్టు మేకింగ్ వీడియో మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది.
కంచె సినిమా సూపర్ హిట్... అనేలా టీజర్ చూస్తే అనిపిస్తుంది. ఈ వీడియో లాంఛ్ చేసినప్పటి నుంచి ఈ చిత్రం లోని సీన్లు పెద్ద చర్చ అయ్యేలా ఉన్నాయి. రెండో ప్రపంచయుద్ధంనాటి విజువల్స్ ని ఇంత వాస్తవంగా ఎలా చిత్రీకరించారంటూ ఆశ్చర్యపోయారు టాలీవుడ్ బాలీవుడ్ జనాలు. 70-80 ఏళ్ల వెనుక కాలానికి సంబంధించిన విజువల్స్ ని చూపడమంటే మామూలు విషయం కాదు. స్వాతంత్ర్యం రాకముందు స్టోరీని ఛాలెంజింగ్ గా తీసుకుని పిక్చరైజ్ చేశాడు క్రియేటర్ క్రిష్. అది కూడా చాలా తక్కువ సమయంలో తీయడం విశేషం.
జార్జియాకు వెళ్లి మరీ యుద్ధ సన్నివేశాలను కంప్లీట్ చేశారు. ఇంతగా కళ్లను కట్టిపడేసే సన్నివేశాల చిత్రీకరణలో యూనిట్ పడ్డ కష్టాన్ని కొంచెం చూపే యత్నం చేశారు. గ్రాఫిక్స్ తో విజువల్ మాయాజాలానికి దూరంగా.. వీలైనంతవరకూ సహజంగానే సన్నివేశాలను చిత్రీకరించిన విధానం చాలా గొప్పగా అనిపించింది. 12 నిమిషాల పాటు కనిపించనున్న రెండో ప్రపంచ యుద్ధ సన్నివేశాలు మూవీకే హైలైట్ కానున్నాయి. ఇందులో పోరాడిన ఓ సైనికుడి లవ్ స్టోరీని ప్రధానంగా చూపించబోతున్నాడు క్రిష్.
అక్టోబర్ 22న రిలీజ్ కానున్న కంచెపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దర్శకుడిగా క్రిష్ కెరీర్ ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళే సత్తా ఈ మూవీకి ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అలాగే రాచకుటుంబానికి చెందిన యువతిగా నటించిన ప్రగ్యా జైస్వాల్ కు కూడా ఈ మూవీ టర్నింగ్ పాయింట్ అవుతుంది.
Kanche-Making-Video/115682