చాలా రోజుల తరువాత ఓ తెలుగుదనం ఉట్టిపడే టైటిల్ తెరమీదకు వస్తోంది. ‘కుందనపు బొమ్మ’ అనే టైటిల్ వినగానే బాపు రమణలు, వారి సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. వారి వారసుల సినిమా కావడం వల్లేనేమో ఆ వాసనలు గుబాళిస్తున్నాయి. సుధాకర్ కోమాకుల, సుధీర్‌వర్మ, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా ఎస్.ఎల్.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ముళ్లపూడి వరా దర్శకత్వంలో జి.అనిల్ కుమార్ రాజు, జి.వంశీకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కె.విశ్వనాథ్, యస్.యస్.రాజమౌళి, బి.గోపాల్, జగదీష్ తలశిల, ప్రవీణ్ సత్తారు, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. థియేట్రికల్ ట్రైలర్ ని డైరెక్టర్ రాజమౌళి ఆవిష్కరించారు. ఆడియో సీడీలను సంగీత దర్శకులు కీరవాణి ఆవిష్కరించి, తొలి సీడీని శివశక్తి దత్తా, రాజమౌళికి అందజేసారు. వేల్ రికార్డ్స్ ద్వారా ఆడియో మార్కెట్లోకి విడుదలయ్యింది. అనంతరం శ్రీ. కె.విశ్వనాథ్ మాట్లాడుతూ – ”టైటిల్ చాలా బాగుంది. అచ్చు తెలుగు టైటిల్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. సినిమా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ”స్టేజ్ అంతా తెలుగుతనంతో ఉట్టిపడుతోంది. ఈ సినిమాలోని కొన్ని బిట్స్ చూసాను. నాకు బాగా నచ్చాయి. బాపు, రమణల బెస్లింగ్స్ వరాకి ఎప్పుడూ ఉంటాయి. హీరోయిన్ కుందనపు బొమ్మలా ఉంది. కీరవాణి అద్భుతంగా సంగీతమందించారు. పాటలన్నీ బాగున్నాయి. సినిమా డెఫినెట్ గా మంచి విజయం సాధిస్తుంది” అని చెప్పారు. డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ – ”రాఘవేంద్రరావుగారి దగ్గర నేను, వరా అసిస్టెంట్ డైరెక్టర్లుగా వర్క్ చేసే వాళ్లం. అప్పుడు వరా అంటే పడేది కాదు. ఎందుకంటే రాఘవేంద్రరావుగారు ఎప్పుడూ, ఏదైనా కూడా వరాని చూసి నేర్చుకోమని చెప్పేవారు. వరా గురించి ఇంత గొప్పగా చెబుతున్నారేంటీ అనుకునేవాడిని. అందుకని తనని నేను ఓ విలన్ లా భావించేవాడిని. ఆ తర్వాత తనతో నేను చెన్నయ్ ట్రావెల్ చేసాను. అప్పుడు తను చాలా మంచి వ్యక్తి అని, క్లీన్ హార్టెటెడ్ అని తెలుసుకున్నాను. వరాకి ఎప్పుడో మంచి సక్సెస్ రావాల్సింది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంటాడని భావిస్తున్నాను” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కీరవాణి, వరా, హీరోలు సుధాకర్, సుధీర్ వర్మ తదితరులు మాట్లాడారు.
ఈ కార్యకర్రమంలో డైరెక్టర్ బి.గోపాల్, హీరోయిన్ చాందిని, సిద్ధు, ప్రవీణ్ సత్తారు తదితరులు సినిమా విజయం సాధించాలని కోరుకుంటూ చిత్రం యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు.
నటీనటులు సుధాకర్ కోమాకుల, సుధీర్‌వర్మ, చాందినీ చౌదరి, రాజీవ్ కనకాల, నాగినీడు, చంద్రశేఖర్, షకలక శంకర్, ఝాన్సీ, మధుమణి, గాయత్రి భార్గవి, ఆలపాటి లక్ష్మీ, అజయ్ ఘోష్, షాని, సిరి, పల్లవి, మాస్టర్ సాత్విక్, బేబీ జాహ్నవి తదితరులు. సాంకేతిక నిపుణులు
మాటలు: అనురాధ ఉమర్జి, గౌతం కశ్యప్, కథావిస్తరణ-స్క్రీన్‌ప్లే: కె.కె.వంశీ, శివ తాళ్ళూరి,
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎస్.డి. జాన్,
ఆర్ట్ డైరెక్టర్: ఎమ్. కిరణ్‌కుమార్, కో డైరెక్టర్: ఎమ్.ఎస్, కొరియోగ్రఫీ: కృష్ణారెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మల్లాది సత్య శ్రీనివాస్, కో ప్రొడ్యూసర్స్: నడింపల్లి నరసరాజు, జి. అనితాదేవి, నిర్మాతలు: జి. అనిల్‌కుమార్ రాజు, జి. వంశీకృష్ణ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ముళ్ళపూడి వరా.