కత్తులూ, తుపాకులూ చూపించి దోచుకోవడ లాంటిది కాదిది.... లారెన్స్ సినిమి ట్రిక్కు... జనాలను భయపెడితే డబ్బులు మూడోసారి కూడా డబ్బలు గుంజాడు లారెన్స్ బాబు. ఈసారి మనోడు ‘‘కాంచన 2’’ (తెలుగులో గంగ) సినిమాతో మరింత ఎక్కువగా టెన్షన్ పెట్టేశాడు. కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులతో బెల్లంకొండ నాలుగు రోజులు లేటుగా తెలుగు వర్షన్‌ను రిలీజ్ చేసినా కూడా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఏకంగా 18.65 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇదంతా కేవలం లారెన్స్ భయపెట్టిన తీరు, తాప్సీ కామెడీ, నిత్యా మీనన్ అవిటి క్యారెక్టర్, చివరకు దెయ్యాల కోసం ఫైటింగ్ చేసే క్లయ్మ్యాక్స్ సీనూ... మొత్తంగా తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే నిర్మాతకు 3 కోట్లు లాభం వచ్చిందట. అదన్నమాట భయపెట్టి డబ్బులు గుంజడమంటే....