ఇది సర్వసాధారణంగా చిన్న స్థాయినుంచి సెలబ్రిటీల వరకూ కనిపించే ఈగోలు, జలసీల వంటి సమస్య అని స్పష్టంగా అర్థమవుతోంది. లక్ష్మీరాయ్ ఈ మధ్య పబ్లిక్ గానే త్రిషను విమర్శిస్తూ వార్తలకెక్కింది. ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళు ఇప్పుడెందుకు గిట్టకుండా అయ్యిందని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయినా ఎవరి పనులు వారు చేసుకుపోక, ఎందుకు ఈ జలసీలు అనిపిస్తుంది కానీ, అసలు బాధ వాళ్ళకే తెలుస్తుంది. ఇంతకీ ఆమెకు కోపం ఎందుకు వచ్చిందంటే వరుణ్ మనియాన్ లక్ష్మి రాయ్‌కి ఫ్రెండ్ అట. ఆమె ద్వారానే త్రిషకి అతను పరిచయం అయ్యాడట. ఆ తర్వాత వాళ్లిద్దరూ క్లోజ్ అయి, ప్రేమించుకుని నిశ్చితార్ధం జరుపుకునే వరకూ వచ్చేసారు. ఇప్పుడు లక్ష్మీ రాయ్ ని వీరిద్దరూ దూరం పెడుతున్నారనేదే ఆమె బాధంతా... తన ద్వారా పరిచయం అయిన వాడిని చేసుకుంటోన్న త్రిష ఇప్పుడు అతడిని తనతో మాట్లాడనివ్వకుండా చేసిందనీ, ఒకప్పుడు లేని స్టేటస్ ఇప్పుడు వారికి గుర్తొచ్చిందని తన లెవల్ వారికి సరిపోదని వరుణ్‌కి బ్రెయిన్ వాష్ చేసిందట. త్రిష వల్ల ఒక మంచి ఫ్రెండ్‌ని కోల్పోయానని, అతన్ని పరిచయం చేసుకోవడం వరకూ తనకు విలువిచ్చి, ఇప్పుడు విసిరేసిందని తట్టుకోలేక ఆక్రోషిస్తోంది లక్ష్మీరాయ్.