సినిమాకు కత్తెర అంటే సెన్సార్ అనే అనుకుంటారు. కానీ కొత్తగా రిలీజైన లింగ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. సినిమా బాగుందని అనిపించాలంటే దర్శక నిర్మాతలు రకరకాల ట్రిక్కులు ప్లే చేయాలి. 'లింగ' విషయంలోనూ ఇప్పుడు ఇలాంటి ట్రిక్కునే వదులుతున్నారు. ఈ సినిమా నిడివి ఎక్కువ ఉందన్న కారణంగా తొమ్మిది నిమిషాలను కత్తిరించారు. సినిమా మొదటి భాగం నుంచి ఆరు నిమిషాలు, ద్వితీయ భాగం నుంచి మూడు నిమిషాల నిడివి తగ్గించారు. దీంతో ప్రేక్షకులకు నిడివి ఎక్కువ ఉన్నా బోర్ కాస్త తగ్గుతుందని అనుకుంటున్నారు. సినిమా ఎలా ఉన్నా ఈ చిత్రంతో రజనీకాంత్ మరోసారి తన అభిమానుల ప్రభంజనాన్ని చాటి చెప్పినట్టయ్యింది. ఎందుకంటే ఇంత వరకూ తమిళంలో ఎప్పుడూ రాని కలెక్షన్ ఈ సినిమా సాధించింది. అది ఏ లెవెల్ లో అంటే ఒక బాలీవుడ్ సినిమా స్థాయిలో కలెక్షన్లు తెచ్చిపెట్టింది. సినిమా విడుదలైన 3 రోజుల్లోనే 100 కోట్ల కలెక్షన్ ఈ సినిమా సాధించింది. తమిళనాడు 55, మిగతా రాష్ట్రాల్లో 26 కోట్లు, విదేశాల్లో 22 కోట్ల కలెక్షన్ అయ్యింది.