సూపర్ స్టార్ రజనీకాంత్, కె.యస్.రవికుమార్ కాంబినేషన్ లో రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన చిత్రం లింగ. విడుదలైన తర్వాత ఆశించిన స్థాయిలో సినిమా సక్సెస్ సాధించక పోవడంతో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నష్టాలపాలయ్యారు. దాంతో వారందరూ లింగ చిత్ర నిర్మాత, రజనీకాంత్ నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ధర్నాలు చేశారు. అప్పట్లో ఈ గొడవ పెద్దదైంది. తర్వాత నిర్మాతల మండలి జోక్యం చేసుకుని కొంత మొత్తాన్ని చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం నిర్మాత మిగిలిన మొత్తాన్ని కూడా డిస్ట్రిబ్యూటర్స్ కి చెల్లించేశాడట. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారట.