లెజండ్ తరువాత బాలకృష్ణను మళ్ళీ తెరమీద చూసే అవకాశం రాలేదు. అంటే దాదాపు సంవత్సరం గ్యాప్ తరువాత ఇప్పుడు మళ్ళీ లయన్ గా తెరమీదకు రాబోతున్నారు బాలయ్య. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ 80 శాతం పైగా పూర్తి చేసుకుంది. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన త్రిష, రాధికా ఆఫ్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఎల్వీ పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. వరల్డ్ కప్ క్రికెట్ తర్వాత మార్చి 27న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది ఈ చిత్ర యూనిట్.