‘’భగవద్గీత యుద్ధానికి ముందు వినపడుతుంది..విని మారకపోతే చచ్చాక వినపడుతుంది. యుద్ధానికి ముందు వింటావా..చచ్చాక వింటావా..’’‘’నేను ఒకడ్ని కలవాలని పిక్స్ అయితే వాటి పెరట్లో పెరిగే మొక్కయినా, వాడి వాకిట్లో మొరిగే కుక్కయినా...వాడి చుట్టూ వాడ్ని కాపలా కాస్తున్న వలైనా, వాడు నిద్రపోతున్నప్పుడు కనే కలైనా..నా కంట్రోల్ లోకి రావాల్సిందే..డోంట్ ఫర్ గెట్ అయామ్ ఫ్రమ్ సి.బి.ఐ’’
‘’పుట్టుకతోనే ఆ భగవంతుడు నా బాడీలోని ప్రతి పార్ట్ లో ఓ పవర్ దాచాడు. పొరపాటున నా బాడీలో ఏ పార్ట్ ను టచ్ చేసినా నీ బాడీ షేప్ మారిపోతుంది. ..’’ ఇలాంటి పంచ్ డైలాగ్స్ తో నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులను, ప్రేక్షకులను ఆలరించడం గ్యారంటీ అంటున్నారు నిర్మాత రుద్రపాటి రమణారావు. నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం ‘లయన్’. రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారధ్యంలో జివ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తోన్న ఈ చిత్రం ద్వారా సత్యదేవ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తొలిసారిగా బాలయ్యతో త్రిష జతకడుతోండగా.. ‘లెజెండ్’ అనంతరం రాధికా ఆప్టే మరోమారు బాలకృష్ణ సరసన నటిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బాలకృష్ణ గెటప్, డైలాగ్స్ కి అభిమానులు, ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న లయన్ మే డే కానుకగా మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా... చిత్రనిర్మాత రుద్రపాటి రమణారావు మాట్లాడుతూ ‘‘లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణగారు చేస్తున్న చిత్రమే మా లయన్. బాలకృష్ణగారి నటవిశ్వరూపాన్ని మరోసారి చాటి చెప్పే చిత్రమవుతుంది. బాలయ్య ఇమేజ్ కి తగిన విధంగా సత్యదేవ అద్భుతమైన కథను తెరెకెక్కించారు. నందమూరి అభిమానులు బాలకృష్ణగారిని ఎలా చూడాలనుకుంటారో అలా ఉండే సినిమా. షడ్రషోపేతమైన మూవీ. ఈ సినిమా ఫస్ట్ లుక్ కి, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ కి, మెలోడి బ్రహ్మ మణిశర్మ అందించిన పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. మణిశర్మగారు ఈ సినిమా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. లయన్ ఆడియో వేడుకలో బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ మంచి స్పందన వచ్చింది. సినిమాలో డైలాగ్స్ ను ఎప్పుడెప్పుడు థియటర్ విందామా అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారనే సంగతి మాకు తెలుసు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని మే డే కానుకగా మే 1న విడుదల చేస్తున్నాం. తప్పకుండా అందరినీ అలరించే చిత్రమవుతంది’’ అన్నారు.