తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితురాలు అందాల మలయాళ నటి లిజి. ఎక్కువ సినిమాలు నటించకుండానే ప్రియదర్శన్ తో పెళ్ళి జరిగి సినిమాలకు స్వస్తి చెప్పింది. ఇన్నాళ్ళ తరువాత ఇరువురికీ విభేదాలు వచ్చి విడిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఆమె భర్త ప్రియదర్శన్ తెలుగులో నిర్ణయం, గాండీవం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి, బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే వీరిద్దరూ చెన్నయ్ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్నారు విషయం తెలిసిందే. అయితే కొత్తగా వచ్చిన వార్త ఏమిటంటే లిటీ తన భర్త నుంచి 80 కోట్లను భరణంగా కోరుతోందట. వీరు సన్నిహితులతో పిల్లలతో సంప్రదించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు లిజీ పత్రికల వాళ్ళతో తెలిపింది.