లిజీ ఆత్మ కథ రాసుకుంటుందట...

May 25, 2015 | 05:23 PM | 95 Views
ప్రింట్ కామెంట్
lissy_autobiography_niharonline.jpg

పాతికేళ్ళ క్రితం మళయాళం, తెలుగు సినిమాల్లో గ్లామర్ పాత్రల్లో కనిపించిన లిజి ఈ మధ్యే భర్త నించి విడాకులు తీసుకుంటున్నట్టు వార్తల్లోకి ఎక్కింది. టాలీవుడ్‌లో తక్కువ సినిమాలు చేసినా మలయాళంలో అప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించింది. రాజశేఖర్ తో  మగాడు, సుమన్‌తో 20వ శతాబ్దం, ఆత్మబంధం.. సురేష్‌తో మామాశ్రీ, కమల్‌హాసన్‌తో ఏజెంట్ విక్రమ్ తదితర చిత్రాల్లో నటించిన లిజీ మళయాళ డైరెక్టర్ ప్రియదర్శన్‌ను పెళ్ళి చేసుకుంది. కొన్నేళ్ళు వీరి కాపురం సక్రమంగానే సాగింది. ప్రియదర్శన్ బాలీవుడ్ వెళ్ళాక  కలతలు, గొడవలతో కోర్టు దాకా వెళ్ళారు. ఆ సమయంలో ఆత్మహత్యాయత్నం కూడా చేసిన లిజి ప్రస్తుతం పిల్లలతో ఒంటరిగానే జీవిస్తోంది. ఇన్ని మలుపులున్న తన జీవిత కథను ముందుగా ఓ మళయాళ మేగజైన్‌లో సీరియల్‌గా రాసి, తర్వాత పుస్తకరూపంలో రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతోందట. లిజి ఆత్మకథలో కొందరు స్టార్స్, డైరెక్టర్లకు చెందిన రహస్యాలు బయట పెడుతుందన్న దానిపై అక్కడ చర్చలు బాగా జరుగుతున్నాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ