ప్రీ రివ్యూ: లోఫర్ పోయినట్లేనా?

December 17, 2015 | 11:49 AM | 1 Views
ప్రింట్ కామెంట్
loafer-movie-pre-review-niharonline

కంచె వంటి ఓ క్లాసికల్ మూవీ తర్వాత వరుణ్ తేజ్ పూరి కాంబినేషన్లో గురువారం విడుదల అయ్యింది. పక్కా మాస్ మసాలా యాక్షన్ తో పూరి మార్క్ డైలాగులతో మదర్ సెంటిమెంట్ మెయిన్ కాన్సెప్ట్ గా ఈ చిత్రం తెరకెక్కింది. పూరీ గత చిత్రం ఫ్లాప్ కావటం, హిట్ ఊపులో వరుణ్ ఉండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రం ప్రీ టాక్ విషయానికొస్తే సినిమా అంత గజిబిజీ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ కాస్త మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన పూరీ, సెకండాఫ్ విషయంలో ఘోర తప్పిదం చేసినట్లు తెలుస్తోంది. అర్థం పర్థం లేని డైలాగులు, అవసరం లేని ఫైట్లు, ముఖ్యంగా చెత్త క్లైమాక్స్ తో సినిమాను రూపుదిద్దాడని కొంత మంది ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

పోనీ ముఖ్య కాన్సెప్ట్ తల్లి సెంటిమెంట్ అయినా వర్కవుట్ అయ్యిందా అంటే అది కాస్త ఓవర్ అయ్యిందని చెబుతున్నారు. ముఖ్యంగా రేవతి పాత్ర ఓవర్ యాక్షన్ చేసినట్లు తెలుస్తోంది. తండ్రిగా ఫుల్ లెంగ్త్ రోల్ లో పొసాని అలరించినప్పటికీ మిగతా పాత్రలు తేలిపోయాయట. వరుణ్ పాత్రను కూడా మరీ దారుణంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. టోటల్ గా వరుణ్ ను మాస్ పాత్రలో చాలా దారుణంగా చూపాడని వారి కామెంట్ల సారాంశం. పూర్తి రివ్యూ కోసం కాసేపు ఆగాల్సిందే.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ