‘లవ్‌టచ్' చిత్రంలో హీరోగా నటించిన జయంత్‌రెడ్డి, పంజాబ్ బెస్ట్ యాక్ట్రస్ 2014గా ఎంపికైన ద్రితి సహరన్ నిజ జీవితంలో ఓ ఇంటి వారయ్యారు. వీరిద్దరు వీరిద్దరూ నటించిన ‘లవ్ టచ్' సినిమాతో వీరి మనసులు కలిసాయి. ఆ తరువాత మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. టిఆర్ఎస్ స్టేట్ లీడర్ పట్లోళ్ళ జైపాల్ రెడ్డి తనయుడైన జయంత్‌రెడ్డి, ద్రితి సహరన్‌ల వివాహం గురువారం శంషాబాద్‌లోని ఫోర్ట్ గ్రౌండ్ మైదానంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు నాయిన నర్సింహారెడ్డి, హరీష్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డిలతో పాటు డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, బాబుమోహన్ పలువురు ఎమ్ఎల్ఎ, ఎమ్‌ఎల్‌సిలు హాజరై దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పంజాబీ యువతీ యువకులు చేసిన నృత్యాలు వీక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి..