మన తెలుగమ్మాయిలు సినీ అందలం ఎక్కిన వారు ఎవరంటే... వేళ్ళమీద లెక్క పెట్టగలిగే వాళ్ళు కూడా లేరేమో... నటన అందం ఉన్నా ఎందుకు వీరిపై దర్శకులు చిన్న చూపు చూస్తారో తెలియదు. మన హైదరాబాద్ అమ్మాయి ’మధుశాలిని’ అంద గత్తె మాత్రమే కాదు మంచి హుషారైన అమ్మాయి, చక్కన అభినయం కూడా ప్రదర్శించగలదు. కానీ ఎన్నాళ్ళ నుంచో ఛాన్సుల కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఇప్పటికి ఓ సినిమాలో హీరోయిన్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ‘చందమామ కథలు’ తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తను తీయబోయే చిత్రంలో మధుశాలినిని హీరోయిన్ గా ఎంపిక చేశాడట. ఈ సినిమాలో కథానాయిక పాత్రలో మధుశాలిని చేస్తుందగా త్వరలో మిగా నటీనటుల ఎంపిక కార్య క్రమం పూర్తి చేసి సెట్స్ పైకి ఈ సినిమా తీసుకువెళ్ళనున్నాడు. అవకాశాలు రాకపోవడం ఒక బ్యాడ్ లక్ అయితే తన అభినయం ప్రదర్శించడానికీ తగిన పాత్ర దక్కాలి కదా... అప్పుడే తను అందరి ద్రుష్టిలో పడి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. చూద్దాం ఈ సినిమా అయినా ఆమెకు మరిన్ని ఛాన్సులు తెచ్చిపెట్ట గులుగుతుందేమో...