మాధూర్ బండార్కర్ ‘క్యాలెండర్ గాళ్స్’

June 13, 2015 | 05:36 PM | 0 Views
ప్రింట్ కామెంట్
Calendar_girls_movie_first_look_niharonline

ఈ డైరెక్టర్ సినిమాలన్నీ రియాలిటీ కథలతోనే కాదు... సినిమాలో గళ్స్ ను హాట్ హాట్ గా చూపించి క్యాష్ చేసుకుంటాడు. ఇప్పుడు ‘క్యాలెండర్ గాళ్స్’ను మరోసారి తెరమీద చూపించబోతున్నాడు బాలీవుడ్ డైరెక్టర్ మాధూర్‌ బండార్కర్. ఆయన లేటెస్ట్ ఫిల్మ్ ఇది. ఐదుగురు బ్యూటీలతోవున్న ఓ ఫోటోని విడుదల చేశాడాయన. ఇందులో నటించే బ్యూటీలంతా కొత్తవారే కావడం మరో విశేషం. రియల్ స్టోరీల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడంలో మాధూర్‌కి తిరుగులేదని ఇండస్ట్రీలో చాలామంది చెబుతుంటారు. బార్‌గాళ్స్‌‌పై ‘చాందినీ బార్’, మోడల్స్‌పై ‘ఫ్యాషన్’, కథానాయికల జీవితాలపై ‘హీరోయిన్’ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. ఇప్పుడేమో ఆయన కన్ను ‘క్యాలెండర్ గాళ్స్‌’పై పడింది. న్యూఇయర్ సందర్భంగా అందమైన భామలకు బికినీలతో ఫోటో షూట్ చేసి క్యాలెండర్స్‌ని విడుదల చేయడం ఇటీవలకాలంలో ఫ్యాషన్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో ‘క్యాలెండర్ గాళ్స్’ జీవితాలపై ఆయన కన్నుపడింది. బికినీలకు పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే బ్యూటీలను ఆయన ఎంపిక చేశాడట. సినిమాలో ఎక్కువ భాగం స్టోరీ స్విమ్ సూట్ చుట్టూనే తిరుగుతోందని టాక్. మరి ఈ సినిమా కోసం ఆగస్టు వరకూ వెయిట్ చేయాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ