మాధూర్ బండార్కర్ తెరకెక్కిస్తున్న మరో కొత్త సినిమా ‘క్యాలెండర్ గళ్స్’. ఆయన ఇప్పటికే నిజ జీవిత కథలతో అనేక చిత్రాలు నిర్మించారు. ఈ మధ్య న్యూఇయర్ క్యాలెండర్ల పేరుతో అందమైన భామలకు బికినీ వేయించి ఫోటో షూట్ జరుపడం ఫ్యాషన్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాలెండర్ గర్ల్స్ జీవితంపై ఆయన సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. ట్రైలర్ కూడా రెడీ చేసారు. అయితే ట్రైలర్లో నగ్న సన్నివేశాలు ఉండటంతో సెన్సార్ బోర్డు కోత పెట్టినట్లు తెలుస్తోంది. ఆ సీన్లకు కోత పెట్టి U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని ఐదుగురు ముఖ్యమైన పాత్రల కోసం ఆరుగురు యంగ్ గళ్స్ ను ఎంపిక చేసుకున్నారు. ఇప్పటి వరకు సినిమాలకు పరిచయం లేని కొత్త ముఖాలను, మెడలింగ్ రంగంలో ఆరితేరిన సూపర్ మోడల్స్‌ను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ డైరెక్టర్ సినిమా అనగానే చిత్ర పరిశ్రమకు రావాలని ఆశ పడుతున్న మోడల్స్ ఉత్సాహంగా ఆడిషన్స్‌కు హాజరయ్యారు. వారి నుండి మంచి నటనా చాతుర్యం, సెక్సీ బాడీ ఉన్న వారిని ఎంపిక చేశారట డైరెక్టర్.