బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ తీయబోయే కొత్త చిత్రం తాలూకు కేలండర్ గర్ల్స్ ముఖాలను మనకు చూపించారు. అందులో భాగంగా ఈ చిత్రంలోని పోస్టర్లను వరుసగా విడుదల చేస్తున్నారు. మొదటి రోజున ముఖాలు కనిపించని హాట్ హాట్ ఫొటో ఒకటి విడుదల చేశారు. గతంలో ఈ పోస్టర్ లో గోల్డ్ కలర్ బికినీ ధరించిన ఐదుగురు భామలు టోపీలు అడ్డం పెట్టి వదిలారు. దీంతో అందరిలోనూ వీళ్ళ ముఖాలు చూడాలన్న ఆసక్తిని క్రియేట్ చేశాడు. అందుకే ఇప్పుడు వీరి ముఖాలు కనిపేంచే పోస్టరు తిరిగి విడుదల చేశాడు. ఏదో ఒకటి కొత్తగా చేయకపోతే జనం దృష్టిని ఆకర్షించటం కష్టంగా ఉంది. ఆ విషయం వర్మ క్యాంప్ నుంచి వచ్చిన వాళ్లకు బాగా తెలుసు. వర్మ శిష్యులుగా కెరీర్ మొదలెట్టి తనకంటూ కీర్తి ప్రతిష్టలు పెంచుకున్న దర్శకుడు మధూర్ భండార్కర్. ఆయన సినిమాలో హాట్ సీన్స్ చాలానే ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలోని ఐదుగురు ముఖ్యమైన పాత్రల కోసం ఆరుగు యంగ్ గర్ల్స్ను ఎంపిక చేసుకున్నారు.