జయం రవి హీరోగా తమిళంలో సూపర్ హిట్ గా నడుస్తున్న సినిమా ‘తని ఒరువన్’. ఈ సినిమా ఆగస్టు 28 రిలీజై తమిళ నాట అదరగొడుతోంది. ఈ సినిమాలో అలనాటి స్టార్ హీరో అరవింద్ స్వామి విలన్ గా నటించాడు. ఇక హీరోయిన్ గా నయనతార నటించింది. ఓ హిట్ సినిమా వచ్చిందంటే సినిమా రీమేక్ కోసం ఇతర భాషల వారు పోటీ పడడం మామూలే కదా... ఇప్పటికే ఈ సినిమా రీమేక్ కోసం పలువురు తెలుగు నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమా పై ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. మహేష్ ఈ సినిమాను చూసి చాలా బాగుందని మెచ్చుకున్నాడట. మహేష్ సన్నిహితులు దీనికి రీమేక్ కోసం ఆసక్తి చూపిస్తున్నట్టు చెబుతున్నారు. కార్పోరేట్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్న మోసాలను అరికట్టడమే పనిగా పెట్టుకున్న ఓ పోలీస్ ఆఫీసర్ కథే ఈ ‘తని ఒరువన్’. ఇప్పటికే పలు సార్లు పోలీస్ ఆఫీసర్ గా కనిపించి మెప్పించిన మహేష్ బాబుకి ఈ కథ బాగా సెట్ అవుతుందని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారికంగా క్లారిటీ రానుంది.
ఇక ఈ సినిమాపై రామ్ చరణ్ కూడా ఇంటరెస్ట్ చూపుతున్న తెలుస్తోంది. మరి రీ మేట్ పగ్గాలు ఎవరి చేతికి వెళతాయో వేచి చూడాల్సిందే.