ఒక్క అవార్డు పంక్షన్లకి తప్ప మరేయితర సినిమా పంక్షన్లకు గానీ, ఈవెంట్లకి గానీ హజరుకానీ టాలీవుడ్ స్టార్లు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్, మహేష్ బాబులే. చిత్రానికి సంబంధించి ఇద్దరు ఆడియో పంక్షన్లు, టీవీల్లో ఇంటర్వ్యూలో తప్ప వేరే ఎక్కడా కనిపించిన దాఖలాలు ఉండవు. అయితే ఈ లిస్ట్ లోంచి ఇప్పుడు మహేష్ కి మినహాయింపు ఇచ్చే సమయం వచ్చిందేమో!
తాజా చిత్రం శ్రీమంతుడికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను మహేష్ పూర్తిగా తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. ఈ రేంజ్ లో మహేష్ తన చిత్ర ప్రచారం చేసుకోవటం ఇదే ప్రథమం. నమ్రత కూడా ఈ విషయంలో మహేష్ కి సలహాలతో సాయం చేస్తుందట. ఇప్పటికే పలు బ్రాండ్ లకు ప్రచార కర్తగా ఉన్న మహేష్ ఆయా ఈవెంట్లకు హాజరైనప్పుడు కూడా శ్రీమంతుడి గురించే మాట్లాడుతున్నాడు. ఈ రకంగా ప్రతీదాంట్లోను పబ్లిసిటీ ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు మహేష్. అంతేకాదు ఈ రోజు సాయంత్రం (ఆగష్టు 1న) సాయంత్రం 6 గంటలకు శ్రీమంతుడి చిత్రంపై అభిమానులతో చిట్ చాట్ కూడా చేయనున్నట్లు సమాచారం. దీనిపై స్వయంగా మహేష్ నే ట్విట్టర్లో ప్రకటన చెయ్యటం విశేషం. బహుశా ‘బాహుబలి’ విజయం ఎఫెక్ట్ తోనే అయి ఉంటుందని సీని వర్గాలు గుసగుసలాడుతున్నాయి.