బుర్రిపాలెంను సూపర్ స్టార్ స్మార్ట్ విలేజ్ చేస్తాడట

February 03, 2015 | 11:04 AM | 44 Views
ప్రింట్ కామెంట్

సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కార్యక్రమంలో భాగంగా ఈ మధ్య పార్లమెంట్ సభ్యులంతా ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని దానిని అభివ్రుద్ధి కోసం కష్టపడటం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా నరేంద్రమోదీ ఇచ్చిన ఈ పిలుపునకు ఎంపీలతోపాటు ఎన్నారైలు, సెలబ్రిటీలు కూడా బాగానే స్పందిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లా గూడూరు మండలం పుట్టంరాజు కండ్రిగ ను దత్తత తీసుకొని దానిని అభివ్రుద్ధి పరచటం. మరో రాజ్య సభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి మొగల్తూరులోని పేరుపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నాడని వార్త విన్నాం. ఇప్పుడు తాజాగా ఎంపీ గల్లా జయదేవ్ ఇదే బాటలో నడవనున్నారు. అయితే ప్రజా ప్రతినిధులు స్వగ్రామం, అత్తగారి ఊర్లను తీసుకోకూడదన్న నిబంధన ఆయకు ఆటంకంగా మారిందట. దీంతో బావకు బాసటగా బరిలో మహేష్ దిగనున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామాన్ని మహేష్ దత్తత తీసుకోనున్నాడట. ఈ విషయాన్ని మహేష్ బావ , గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ స్వయంగా ప్రకటించాడు. ఎన్నికలకు ముందే మహేష్ తాను, బుర్రిపాలెంను డెవలప్ చేయాలని డిసైడ్ అయ్యారట. కానీ, ఎలక్షన్ కోడ్ అడ్డురావటంతో అప్పుడు అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మహేష్ బుర్రిపాలెంను, తన భార్య పద్మ కంచర్లపాలెంను దత్తత తీసుకోనున్నారని జయదేవ్ వెల్లడించారు. ఇప్పటికే తన సంపాదనలోని 30 శాతం ను సేవా కార్యక్రమాలకు వినియోగించే మహేష్ ఇప్పుడు అదనంగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని స్మార్ట్ విలేజ్ గా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నించటం అభినందనీయమే కదా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ