సుధీర్ బాబు సినిమా విడుదలైన వారం రోజుల తరువాత ఈ సినిమా గురించి మహేష్ బాబు స్పందించారు. ఇప్పటికే ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' సినిమాకు ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అంటూ క్రిటిక్స్ నుంచి మంచి స్పందన వచ్చేసింది. మహేష్ బావ అయిన సుధీర్ బాబును మీ సినిమాకు మహేష్ బాబును ప్రమోట్ చేయమనొచ్చు కదా అన్న కొందరి ప్రశ్నకు ఆయనకు నచ్చితే బాగుందంటారు... లేకపోతే ఎంతమంది అడిగినా అలా చెప్పరని సుధీర్ బాబు ఇంతకు ముందే చెప్పారు. కాస్త ఆలస్యంగా స్పందించినా మహేష్ బాబు ఈ సినిమ గురించి ట్వీట్ చేసాడు. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చాలా హానెస్ట్ లవ్ స్టోరీ తప్పకుండా చూడదగిన సినిమా. సుధీర్ బాబు హీరోగా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు’ అంటూ బావ సినిమాను పొగిడాడు మహేష్.
ఇక చిత్రానికి.. రోజురోజుకీ ఆదరణ పెరుగుతోందంటున్నారు నిర్మాతలు శిరీష, శ్రీధర్. గతవారం విడుదలైన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తుండడంతో.. మరో 24 థియేటర్స్ ని పెంచారట. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన పోసాని కృష్ణ మురళి... సినిమా సక్సెస్ పట్ల తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఒక రచయితగా తన మనసుకు నచ్చిన కథ ఇది అన్నారు. మహిళా ప్రేక్షకులు అందరూ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇదన్నారు కన్నడలో విజయంతమైన 'చార్‌మినార్'కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం కథలో .... యుస్ ఎ లో ఓ పెద్ద కంపెనీకి సీఇఓగా పనిచేసే కృష్ణ (సుధీర్ బాబు), తాను చదివిన స్కూల్ గెట్ టుగెదర్ ఫంక్షన్ లో పాల్గొనడానికి తన సొంత ఊరు కృష్ణాపురంకి బయలుదేరడంతో సినిమా మొదలవుతుంది. హైదరాబాద్ లో దిగి కృష్ణాపురంకి జర్నీ మొదలవ్వగానే కృష్ణకు తన గతం గుర్తు వస్తుంది. తను ఎదుగదలకు కారణమైన తను ఎంతగానో ఇష్టపడ్డ రాధ (నందిత) చుట్టూ తిరుగుతుంది. చివరి వీరి ప్రేమ ఫలిస్తుందా లేదా అనేదే ఈ చిత్రం కథ.