మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాపై ప్రేక్షకుల్లో మంచి స్పందన కనిపిస్తోంది. ఆయన సినిమాలు ఇంతకు ముందు రెండూ బాక్సాఫీస్ డిజాస్టర్లు కావడంతో ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్న ఎక్స్ పెక్టేషన్స్ తో ఈ సినిమా కు బాగా పెరిగిపోయాయి. అందులో ఈ సినిమాలో ఊరిని దత్తత తీసుకోవడం అన్న కొత్త కాన్సెప్ట్ ఉండడంతో... ఇంతకు ముందు సినిమాల్లా కాకుండా ఏదో కొత్త దనం ఉంటుందన్న ఆసక్తి ఆడియన్స్ లో మరింత కనిపిస్వితోంది. విడుదలైన టీజర్ ను బట్టి ఈ సినిమా బిజినెస్ రేంజ్ అంచనాలను మించి పోతోంది. శ్రీమంతుడు సినిమా ఆగస్టు 7న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే అద్భుతమైన బిజినెస్ జరుగనున్నట్టు తెలుస్తోంది. ఏ ఏరియాలకు ఎంతెంత రేట్ పలుకనున్నదో ముందుగానే అంచనాను బట్టి తెలుస్తున్నదేమిటంటే... నైజామ్ 14.40 కోట్లు, సీడెడ్ 7.20 కోట్లు, ఆంధ్ర 21 కోట్లు, కర్నాటక 6 కోట్లు, ఓవర్సీస్ 9 కోట్లు, ఆర్ ఓ ఐ 2 కోట్లు, సాటిలైట్ 10.25, ఇతరములు 1.50 కోట్ల వ్యాపారం జరుగనున్నట్టు తెలుస్తోంది. అంటే విడుదలకు ముందే ఈ చిత్రం మొత్తం మీద 80 కోట్లు పలుకుతున్నట్టు తెలుస్తోంది.