బుల్లి ప్రిన్స్ తో తెగ ఎంజాయ్ చేస్తాడట

December 17, 2014 | 03:26 PM | 29 Views
ప్రింట్ కామెంట్

న్యూ ఇయర్ వేడుకలకు టాలీవుడ్ ప్రముఖులు అప్పుడే ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలసి అబుదాబి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రత ఓ మీడియా సంస్థకు వెల్లడించింది. "గత కొన్నాళ్లుగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి యూఏఈ మా ఫేవరైట్ లొకేషన్ అయిపోయింది. అందుకే, ఈ ఏడాది కూడా అబుదాబి ప్లాన్ చేసుకున్నాం. మా పిల్లలు చిన్న వాళ్లు కాబట్టి జెట్ లాగ్ లేకుండా వుండడం కోసం దగ్గరలో వున్న సౌకర్యవంతమైన దేశానికి వెళుతున్నాం. ఆ విధంగా అబుదాబి మాకు బాగా నచ్చింది" అని చెప్పింది. ఈసారి మహేష్ తన పిల్లలతో కలసి అక్కడి ఎడారులలో ఒంటెలపై సవారీ, అలాగే ఫ్యాట్ బైకింగ్ రైడ్ కి వెళతాడట!. అయితే ఫ్యాన్స్ మాత్రం తమ ఫెవరెట్ హీరో టూర్లతోకాకుండా కమిట్ అయిన కొరటాల శివ సినిమా తొందరగా కంప్లీట్ చేసి తమ ముందుకు రావాలని కొరుకుంటున్నారు. కానీ, షూటింగ్ లతో ఎప్పుడూ బిజీగా ఉండే మహేష్ ఇలా కుటుంబసభ్యులతో కలిసి జాలీగా గడిపేందుకు సమయం కేటాయించటం సబబే కదా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ