తమిళంలో డబ్బింగ్ చెప్పుకున్న మహేష్

July 28, 2015 | 03:33 PM | 1 Views
ప్రింట్ కామెంట్
srimanthudu_new_photos_niharonline

 ‘శ్రీమంతుడు’ సినిమా తెలుగు, తమిళంలో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఆగష్టు 7కు ఈ సినిమాని రిలీజ్ కు సిద్ధమైంది. అయితే తమిళంలో ఈ సినిమాను ‘సెల్వందన్’ అనే టైటిల్ తో రిలీజ్ చేయబోతున్నారు.  ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు తమిళ వెర్షన్ కి తానే డబ్బింగ్ చెప్పనున్నాడనుకుంటున్నారు. మహేష్ బాబు బాల్యం, కాలేజ్ డేస్ అన్నీ చెన్నైలోనే గడిచాయి, తమిళంలో చాలా బాగా మాట్లాడగలడు. అందుకే ఈ సినిమాకి తనే డబ్బింగ్ చెప్పడానికి సిద్దమయ్యాడని అంటున్నారు. ఈ సినిమాలో పని చేసిన కొందరు నటులు మహేష్ బాబు తమిళ్ మాట్లాడటం చూసి షాక్ అయ్యారట. అయితే తన తదుపరి సినిమాని తెలుగు, తమిళ భాషల్లో షూట్ చేసి, రిలీజ్ చేయనున్నారట. దీంతో  ఈ సినిమా నుంచే తన వాయిస్ ని తమిళులకు పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాడట శ్రీమంతుడు. తమిళ వెర్షన్ ఆడియో జూలై 31న చెన్నైలో జరగనుంది. మహేష్ తో పాటు టీం మెంబర్స్ అందరూ ఈ వేడుకకి హాజరు కానున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ