ఎప్పుడూ ఎవరినీ కామెంట్ చేయక, ఎవరి జోలికీ వెళ్ళక... సినిమా వేడుకల్లో తక్కువగా కనిపిస్తూ... ఒక వేళ కనిపించినా... ఎప్పుడో ఓసారి ఓ చిరునవ్వు చిందిస్తూ కనిపించే మహేష్ బాబుకు అభిమానుల సంఖ్య విపరీతం. ఇక ఆయన సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వంతు బాధ్యతగా పనిచేయడంతో మరింత అభిమానం పెరిగిపోతోంది ఆయన మీద. ఇటు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా... అటు వివిధ కార్పొరెట్ కంపెనీల యాడ్స్ లో నటిస్తూ అంతే బిజీగా ఉంటాడు. ఇంత బిజీలోనూ మహేష్ బాబు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. హీల్ ఎ చైల్డ్ ఆర్గనైజేషన్ కి ఆర్ధికంగా తనవంతు సహాయం చేస్తున్నాడు. రెయిన్బో హాస్పిటల్ కు కూడా మహేష్ సహాయం అందుతోంది. మహేష్, అతని భార్య నమ్రత శిరోద్కర్ కలిపి ఛారిటీ కోసం ఓ అకౌంట్ మెయింటెన్ చేస్తూ ఈ సహాయ కార్యక్రమాలను చేస్తున్నారు. తాజాగా 'రెయిన్ బో హాస్పిటల్స్'కు గుడ్ విల్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి అంగీకరించాడు మహేష్ బాబు. ‘‘ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం నా బాధ్యతగా ఫీలవుతున్నాను'' అని ఆయన అనడంపై అభిమానులకు ఆయనపై గౌరవం మరింత పెరిగిపోతోంది. రెయిన్ బో హాస్పిటల్స్ కు సంబంధించిన ఈ యాడ్ చూస్తే మహేష్ అభిమానులంతా ఫ్లాట్ అవ్వాల్సిందే...