సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం లాభాల సంగతి పక్కన పెడితే అంటే బయ్యర్ల లాభాలు ఎలా ఉన్నా యాభై కోట్ల షేర్ మాత్రం సాధించింది. దీంతో త్రివిక్రమ్‌కి ఆడియన్స్ కి ఏం కావాలో బాగా తెలుసునన్న టాక్ సినీ ఇండస్ట్రీలో పడిపోయింది. ఇక ఆయనకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. త్రివిక్రమ్ తన తదుపరి సినిమా మహేష్‌బాబుతో చేస్తానని ఇంతకు ముందే చెప్పాడు. కానీ ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ఎన్టీఆర్ సినిమాని ముందుగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మహేష్ బ్రహ్మూత్సవం తర్వాత పూరి జగన్నాథ్‌తో ఒక చిత్రం చేయడానికి కమిట్ అయ్యాడు. అంటే మహేష్‌బాబు ఫ్రీ అవడానికి కనీసం ఏడాది పడుతుంది. అందుకే త్రివిక్రమ్ ముందుగా ఎన్టీఆర్ చిత్రాన్ని మొదలు పెట్టేసి ఆ తరువాత మహేష్ సినిమా చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా ఇంకా మొదలు కాలేదు, కానీ త్రివిక్రమ్‌తో చేసే సినిమాని అక్టోబర్‌లో స్టార్ట్ చేయడానికి రెడీ ఉన్నాడని తెలిసింది. అందుకని మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రావడానికి దాదాపు ఏడాదిన్నర సమయం తీసుకోవచ్చునని సినీ వర్గాల బోగట్టా.