‘మనం’ సినిమా తీయక ముందే నట వారసులు కలిసి సినిమా చేస్తే బాగుంటుందని చాలా మంది ప్రేక్షకులు కోరుకున్నారు. ఒక సందర్భంలో నందమూరి నటులంతా కలిసి సినిమా చేస్తే బాగుంటుందని డైరెక్ట్ గా చాలా మంది అభిమానులు అడిగారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఒక్కో ఫామిలీలో ముగ్గురుకి పైగా నట వారసులు వచ్చేశారు. నాగార్జున లాంటి వారు ’మనం’ లాంటి ఓ మంచి సినిమా తీసి అలాంటి సినిమా చేయాలనే కోరిక ప్రతి నట కుటుంబంలోనూ కలిగించారు. మంచువారంతా కలిసి ఈ మధ్యే పాండవులు పాండవులు తుమ్మెదా అనే సినిమా చేశారు. అందులో లక్ష్మి కూడా ఓ పాత్రలో దూరిపోయి ఉంటే బాగుండేది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మనం లాంటి ఓ సినిమా చేయాలని కోరికతో ఉన్నారట. మహేష్ ,కృష్ణ ,మహేష్ తనయుడు గౌతమ్ , రమేష్ బాబు లతో కలిసి ఓ సినిమా రూపొందించాలని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు మహేష్. అక్క మంజుల, ఓ చిన్న పాత్రలో నమ్రత కూడా నటిస్తే మరింత బాగుంటుంది. దానికి తగినట్టుగా కథ తయారవ్వాలి కదా.
నిజానికి ఈ ప్రయోగం కృష్ణ గారు ముగ్గురు కొడుకులు సినిమాతోనే చేశారు. అందులో కృష్ణ, రమేష్, మహేష్ (బాలనటుడు), ప్రియదర్శిని (చిన్ని చెల్లి...బుల్లమ్మాయి) కలిసి నటించారు. మళ్ళీ మనం చూశాక మహేష్ కు మరో సినిమా చేయాలని కోరిక కలిగింది. ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుగుతు న్నాయట. కథ కుదిరి ఇలాంటి సినిమా ఒకటి రాబోతోందని తెలిస్తే ఘట్టమనేని అభిమానులకు పండగే పండగ....