టాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచిన నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌లో రూపొందిన చిత్రం ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’. శర్వానంద్, నిత్యామీనన్ జంటగా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.యస్.రామారావు సమర్పణలో సి.సి.మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ బ్యానర్‌పై క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. గ్రాండ్‌లెవల్‌లో ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదలై సూపర్‌హిట్టయింది. మంచి కలెక్షన్స్‌తో ప్రేక్షాకాదరణ పొందుతున్న సక్సెస్‌ఫుల్‌గా 25 రోజులను పూర్తి చేసుకుంది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా... చిత్ర సమర్పకులు కె.యస్.రామారావు మాట్లాడుతూ ‘‘మంచి సినిమాల కోసం, ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కలిసి చూసే మంచి సినిమాల కోసం ఎదురుచూస్తున్న అభిరుచి గల ప్రేక్షకుల కోసం నిర్మించిన ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ చిత్రాన్ని చిన్నా, పెద్దా తేడా లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూసి చాలా పెద్ద హిట్ చేశారు. పవిత్రమైన ప్రేమ ఎప్పటికైనా ఫలిస్తుందన్న పాజిటివ్ అంశంతో నిర్మించిన ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ చిత్రాన్ని యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా మళ్ళీ మళ్ళీ చూడడం వలనే ఇది ఇంత పెద్ద హిట్ అయింది. మా క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నుండి ఓ మంచి కథాంశంతో మళ్ళీ ఓ సూపర్ డూపర్ హిట్ రావాలని కోరుకున్న మా మిత్రులు, శ్రేయోభిలాషుల శుభాశీస్సులతో ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సెన్సేషనల్ హిట్ అవడమే కాకుండా 25రోజులను పూర్తి చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మా సంస్థ మీద ఎంతో అభిమానంతో మాకు మంచి విజయం రావాలని కోరుకున్న వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మంచి సినిమా తీస్తే తప్పకుండా ప్రేక్షకులు సూపర్‌హిట్ చేస్తారన్న నా నమ్మకాన్ని ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ మళ్ళీ ఇంకోసారి నిరూపించింది. ఈ విజయం మరిన్ని మంచి చిత్రాల్ని, గొప్ప చిత్రాల్ని నిర్మించడానికి ఎంతో స్ఫూర్తినిచ్చింది. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సాధించిన విజయం మాది కాదు, మీది. ఉత్తమాభిరుచిగల ప్రేక్షకులందరిదీ. ఈరోజు ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సాధించిన సంచలన విజయం వెనుక ఎంతోమంది వ్యక్తుల కృషి వుంది. ప్రేమ యొక్క పవిత్రతను మనసుకు హత్తుకునేలా రూపొందించిన మా దర్శకుడు క్రాంతిమాధవ్, కథలోని హీరోహీరోయిన్ పాత్రలకు తమ అద్భుత నటనతో ప్రాణ ప్రతిష్ట చేసిన శర్వానంద్, నిత్యామీనన్, మన విశాఖపట్నం అందాల్ని ఎంతో అందంగా తెరపైకి ఎక్కించి సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేలా ఫోటోగ్రఫీ చేసిన జ్ఞానశేఖర్, చాలాకాలం తర్వాత మళ్ళీ మధురమైన సంగీతాన్ని విన్నామన్న అనుభూతిని కలిగించిన సంగీత దర్శకుడు గోపిసుందర్, ద్వందార్థాలకు తావు లేకుండా చక్కని డైలాగ్స్ రాసిన సాయిమాధవ్ బుర్రా, ఈ లవ్‌స్టోరీని అద్భుతంగా ఎడిట్ చేసిన సీనియర్ మోస్ట్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, అందమైన ప్రేమకథను మరింత అందంగా చూపించిన కళాదర్శకుడు సాహి సురేష్ ఇంకా ఎందరెందరో అహర్నిశలు చేసిన కృషికి ఫలితమే ఈరోజున ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ‘మళ్ళీ ఇది రాని రోజు’ చిత్రం సాధించిన గొప్ప విజయం. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు.