‘డర్టీ పాలిటిక్స్’ సినిమా విడుదలైనప్పుడు, అభ్యంతర కర సీన్లు ఈ సినిమాలో ఉన్నాయంటూ కోర్టుకు వెళ్ళారు కొందరు. ఇంతకు ముందు పాలిటిక్స్ సినిమాలంటే దుర్మార్గం, అరాచకం కనిపించేది... కానీ ఈ పాలిటిక్స్ లో డర్టీ అంటే అచ్చంగా మల్లికాషరావత్ సగం దుస్తులతో దర్శనమిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ చిత్రంపై అప్పట్లో అనేక వివాదాలు నెలకొన్నాయి. రాజస్థాన్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన 'భన్వరీదేవి' ఉదంతం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వెండి తెరపై శృంగారాన్ని ఒలికించిన మల్లికా శెరావత్ ఈ చిత్రంలో పల్లెటూరు పడుచుగా కనిపించింది. ఈ చిత్రానికి కెసి. బోకాడియా దర్శకత్వం వహించారు. రాజకీయ నాయకుడి పాత్రలో ఓంపురి నటించారు.‘తన సెక్స్ అప్పీల్ ఉపయోగించి ఒక మహిళ జీవితంలో ఎలా ఎదిగింది అనే అంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. తను అనుకున్నది సాధించడానికి ఏం చేయడానికైనా సిద్ధ పడే మహిళ పాత్రలో మల్లికా షెరావత్ నటించింది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఆన్ లైన్లో విడుదైలైంది. ఇకనేం చూడని వాళ్ళుంటే చూసెయ్యండి మరి....