వారసుల పరంపరలో దర్శకుడు సత్య ప్రభాస్

June 16, 2015 | 05:06 PM | 0 Views
ప్రింట్ కామెంట్
raviraja_pinisetty_and_his_sons_adi_satya_prabhas_niharonline

ఒకప్పటి నటుల, నిర్మాతల, దర్శకుల సినీ రంగ ప్రవేశం వారి అభిరుచి మేరకు ఎంతో కష్టనష్టాల కోర్చి సినీ రంగంలో నిలదొక్కుకున్నారు. సరైన సపోర్ట్ లేక ఈ ఫీల్డులో రానించని వారూ ఉన్నారు. ఇప్పుడు ఆ విషయాలు పక్కన పెడితే... హీరోల సుపుత్రులు హీరోలుగా... లేక ఇతర రంగాల్లో సెటిలైపోతున్న వారూ ఉన్నారు. ఇప్పుడు సౌత్ నార్త్ ఎక్కడైనా సినిమా రంగంలో ఎక్కువగా వారసులే ఉన్నారు. ఇదే క్రమంలో మరొకరు ఎంట్రీ ఇచ్చారు. అతనే సత్య ప్రభాస్. ఈ కుర్రాడు ఎవరో కాదు చంటి, పెదరాయుడు, యముడికి మొగుడు లాంటి హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు రవి రాజా పినిశెట్టి తనయుడు. ఇప్పటికే ఆయన పెద్ద కొడుకు ఆది పినిశెట్టి తెలుగు, అతమిళం సినిమాల్లో నటించి నెమ్మదిగా పైకెదుగుతున్నాడు. ఆది నటుడిగా రాణిస్తుండగా, సత్య ప్రభాస్ మాత్రం తండ్రి లాగా దర్శకుడిగా రాణించాలని నిర్ణయించుకున్నాడు. అమెరికన్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో దర్శకత్వ శాఖలో కోర్సు చేసిన సత్య ప్రభాస్, స్టూడెంట్ గా ఉన్నపుడు షార్ట్ ఫిల్మ్స్ తీసి అవార్డులు సొంతం చేసుకున్నాడు. దర్శకత్వ శాఖలో పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన తర్వాత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ‘మలుపు' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. త్వరలో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ చిత్రం సోదరుడు ఆది హీరో కాగా, నిక్కి గల్‌రాణి, మిథున్ చక్రవర్తి, నాసర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన కనిపిస్తోంది. టేకింగ్ చాలా ఆసక్తికరంగా ఉంది. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ