62వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ఉత్సవం సౌత్ తారలతో తళుక్కుమంది. ఈసారి హీరోయిన్లందరూ ఒకరిని మించి మరొకరు సెక్సీ డ్రెస్సుల్లో కనిపించారు. ఎప్పుడూ కనిపించని విధంగా ఈసారి కాజల్ కూడా కాస్త సెక్సీగానే కనిపించారు. ఉత్తమ నటి అవార్డును అందుకున్న శృతి హాసన్ క్లివేజ్ కనిపించేలా సెక్సీ డ్రెస్ వేసుకొని తండ్రితో తెగ పోజులిచ్చేసింది. బాలీవుడ్ తారలకంటే మేమేం తీసిపోలేదు అన్నట్టుగా సెక్సీగా కనిపించడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది సౌత్ తారలకు కూడా.
ఎప్పటిలాగే ఈ సారి కూడా ఫిల్మ్ ఫేర్ అవార్డుల ఉత్సవం చెన్నైలో నిర్వహించారు. నిన్న (జూన్ 26న) చెన్నైలోని ఇండోర్ స్టేడియంలో 62వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం వైభవంగా జరిగింది. ఇక తెలుగు సినిమా విభాగానికి సంబంధించి విజేతలెవరనేది చూసినట్టయితే... మనం సినిమా నాలుగు అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (రేసుగుర్రం చిత్రంలో నటనకుగాను) ఉత్తమ నటి: శృతి హాసన్ (రేసుగుర్రం చిత్రంలో నటనకుగాను) ఉత్తమ చిత్రం: మనం ఉత్తమ దర్శకుడు: విక్రమ్ కుమార్ (మనం) ఉత్తమ సహాయ నటుడు: జగపతి బాబు (లెజెండ్) ఉత్తమ సహాయ నటి: మంచు లక్ష్మి (చందమామ కథలు) ఉత్తమ గాయకుడు: సింహా (రేసు గుర్రం చిత్రంలో సినిమా చూపిస్తా మామా పాటకు గాను) ఉత్తమ గాయని: సునిత (ఊహలు గుసగుసలాడే చిత్రంలో ఏం సందేహం లేదు పాటకుగాను) ఉత్తమ సంగీతం : అనూప్ రూబెన్స్ (మనం) ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (మనం చిత్రంలో కనిపించిన మా అమ్మకే పాటకు గాను) ఉత్తమ సినిమాటోగ్రఫర్: పిఎస్ వినోద్ (మనం) ఉత్తమ తెరంగ్రేట నటుడు: బెల్లంకొండ శ్రీనివాస్ (అల్లుడు శ్రీను) లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు: నటి రాధిక అందుకున్నారు.