‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ చేతిలో జయసుధ ఓటమి పాలైన నేపథ్యంలో.....ముందు నుండీ జయసుధకు మద్దతుగా ఉంటూ వస్తున్న మంచు లక్ష్మి ప్రసన్న తనదైన రీతిలో స్పందించారు. ‘మా' ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ పోటీ చేస్తున్నందుకే ఆమెకు మద్దతు ఇచ్చామని తెలిపారు. గెలుపొందిన రాజేంద్రప్రసాద్ కు అభినందనలు తెలిపారు. తనను మా ఉపాధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం మంచు లక్ష్మి ఆనందం వ్యక్తం చేసారు. సినీ ఆర్టిస్టులు, సినీ కార్మికుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. మా ఉపాధ్యక్షురాలిగా తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తానని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు.