ప్రముఖ నిర్మాత, నటి మంచు లక్ష్మీప్రసన్న ఈ మధ్య కాలంలో ఎప్పుడూ న్యూస్ హెడ్ లైన్లలో వెలిగిపోతూనే ఉంది... సీనియర్ నటుడు మోహన్ బాబు కూతురుగా కాకుండా... తన ఓన్ ఐడెంటిటీని తనే క్రియేట్ చేసుకుంది. ఈమధ్య వరుస సినిమాల ద్వారా సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. సినిమాలకంటే ముందుగా ‘ప్రేమతో మీ లక్ష్మీ’ టాక్ షో ద్వారా టీవి ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఆ తర్వాత నిర్మాతగా, నటిగా బిజీ అయ్యి టీవి షోలకు దూరమయ్యారు. కానీ మరోసారి తన టాక్ షో ద్వారా అలరించడానికి సిద్దమవుతుంది లక్ష్మీ. ఈ మధ్యే తన కొత్త చిత్రం ‘దొంగాట’ ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ- ‘నేను – మనోజ్ కలిసి జీ టీవిలో ఒక టాక్ షో ప్లాన్ చేస్తున్నాం. ఆ షోకి ‘మంచు లక్ష్మీతో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ అనే టైటిల్ పెట్టాము’ అని చెప్పింది కానీ ఈ టాక్ షో వివరాలు మాత్రం చెప్పలేదు. ఇది గేమ్ షోనా... ఇంటర్వ్యూనా అనేది ఎదురు చూడాల్సిందే...