తెలుగు సినిమా హీరోలు పెళ్ళి కావలసిన వారి లిస్టు బాగానే ఉంది. ఎందుకొచ్చిన తంట అమ్మాయిలు ఇంట్లో దూరేసి ప్రేమించానంటూ వెంటపడతారు... త్వరగా పెళ్ళిళ్ళు చేసుకుంటే పోలా... ఇలాగే అనుకున్నాడేమో మంచు వారబ్బాయి త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మంచు మనోజ్ ప్రణీత రెడ్డి అనే అమ్మాయిని పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య మంచి పరిచయం ఉందని, ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్ట పడుతున్నారని వార్తలు వినిపించాయి. మంచు మనోజ్ కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరి వివాహ ముహూర్తపు రోజు వినిపిస్తుందని సినీ ఫీల్డులో అనుకుంటున్నారు. మంచు విష్ణు భార్య వెరోనికాకు ప్రణీత క్లోజ్ ఫ్రెండ్ అని తెలుస్తోంది. ఈ విధంగానే ఆమె మంచు మనోజ్ కు కొన్నాళ్ల క్రితం పరిచయం అయిందట. త్వరలోనే ఎంగేజ్ మెంట్ డేట్ ప్రకటించి, అనంతరం వివాహ విషయాలు వెల్లడి చేయనున్నట్టు తెలుస్తోంది.