కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సోషల్ యాక్టివిటీస్ లోనూ, అందరితో సంబంధ బాంధవ్యాల విషయంలోనూ సన్నిహితంగా ఉండే మంచు లక్ష్మికి పరిశ్రమలో ఉన్న తనకున్న విలువేమిటో ఇప్పుడు స్పష్టమైంది. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఏ విషయాన్నైనా చక్కగా జస్టిస్ చేయగల నైపుణ్యం ఆమెకు బాగా ఉంది. ఆమె అంటే అందరికీ అభిమానమే. ఈ విషయం నిరూపిస్తూ ఆమెను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఉపాధ్యక్షులుగా శివకృష్ణ, మంచు లక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నికచేసారు.
అలాగే మా కార్యనిర్వహక ఉపాధ్యక్షుడుగా తనికెళ్ళ భరణి, మా ప్రధాన కార్యదర్శిగా శివాజీ రాజా, కార్యదర్శిగా ఆలీ ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి మాత్రం ఓటింగ్ తప్పేలా లేదు. ఈ పదవికి రాజేంద్రప్రసాద్ - జయసుధల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. ఈనెల 29న 'మా' అధ్యక్ష పదవి ఎన్నికలు జరుగనున్నాయి.