జాదూగాడు సినిమా పాటలు కొత్త కుర్రాడు చేసినవిగా అనిపించడం లేదు... కాస్త తెలిసిన సంగీత పోకడ కనిపించింది అన్ని పాటల్లోనూ... అయితే ఈ సంగీత దర్శకుడు ఎవరో కాదు... మనశర్మ తనయుడు. ‘‘నాకు చిన్నతనం నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం. మా తాతగారు వైయన్ శర్మ ప్రముఖ సంగీత వాద్యకారుడు. ఇక మా నాన్న గారు మణిశర్మ గురించి అందరికీ తెలుసు. అలా వారిద్దరి ప్రభావంతోనే నేనూ సంగీతాన్ని ఎంచుకున్నా..’’ అన్నారు సాగర్ మహతి. ప్రముఖ సంగీత దర్శకుడు మణి శర్మ కుమారుడు సాగర్ మహతి ‘జాదూగాడు’ చిత్రంతో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. దర్శకుడు యోగి తనకు ఈ అవకాశం ఇచ్చాడని చెప్పుకున్నాడు.అంతకు ముందు కీ బోర్డు ప్లేయర్‌గా, ప్రోగ్రామర్‌గా పనిచేస్తున్న తనకు జాదూ గాడు సినిమాకు అవకాశం ఇచ్చాడట. తన తొలి చిత్రం పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశాడు. అంతే కాదు ఆయన మీద తండ్రి ప్రభావం బాగా ఉందని గర్వంగా చెప్పుకుంటున్నాడు. 80 శాతం తండ్రిదయితే... మిగతా 20 శాతం సంగీత దర్శకుడు కల్యాణ్ మాలిక్ దని చెపుతున్నాడు. కళ్యాణ్ మాలిక్ వద్ద ఆయన చాలా కాలం పని చేశానని చెప్పుకున్నాడు సాగర్ మహంతి. తన పాటలన్నీ మణి శర్మ సంగీతంలా ఉన్నాయని అన్నప్పుడు సాగర్ చాలా గొప్పగా ఫీలవుతున్నాడట. జాదూ గాడు సినిమాతో మరికొన్ని అవకాశాలు వస్తున్నాయని సాగర్ తెలిపాడు.