మణితర్నం ‘ఒకే బంగారం’ హిట్ తెచ్చిన జోష్ లో ఉన్నారిప్పుడు. గత కొంత కాలంగా ఆయనకు హిట్లు తగ్గిపోయాయి. కాదల్, రావణ్ వంటి సినిమాలు అంతగా ఆడలేదు. గురు సినిమా హిందీలో ఆవరేజ్ టాక్ తెచ్చుకుంది. తెలుగు, తమిళ్ లో విడుదల చేసినప్పటికీ ఇక్కడి ప్రేక్షకులకు అంతలా కనెక్ట్ కాలేదు. చివరికి ఒకే బంగారం తో మళ్ళీ పూర్వపు ఉత్సాహం వచ్చింది ఆయనలో. ఇప్పుడు ఈ ఉత్సాహంతో మణిరత్నం మళ్ళీ ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. ఈ కథతో పాటు ఓ క్రేజీ కాంబినేషన్ ని కూడా సెట్ చేసినట్టు ఇంతకు ముందే ప్రకటించారు. (హీరో కార్తీ తమిళ్ – మలయాళ యంగ్ హీరో దల్క్వేర్ సల్మాన్) గత కొద్ది రోజులుగా మణిరత్నం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను డిసెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారట. ఈ సినిమా గురించిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఓకే కన్మణితో మనకు ప్యూర్ లవ్ స్టొరీని చెప్పిన మణిరత్నం ఈ సారి ప్యూర్ రివెంజ్ డ్రామా కథని సిద్దం చేసాడట. అలాగే ఇందులో సూపర్బ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయని సమాచారం. మణిరత్నం ఒకేసారి తమిళ్ – మలయాళ భాషల్లో షూట్ చేయనున్నారు. ఈ ద్విభాషా చిత్రం మలయాళ వెర్షన్ లో మమ్ముట్టి ఓ మెయిన్ రోల్ లో కనిపించనున్నాడట.